ఉపాధ్యాయునికి మరపురాని బహుమతి!


ఉపాధ్యాయుల గొప్పదనం, వారికి ఇవ్వాల్సిన విలువని తెలిపే సంఘటన ఇది. తమ విద్యార్ధి ప్రయోజకుడై కళ్లముందు నిలబడితే ఆ ఉపాధ్యాయుడుకి ఎంత ఆనందం కలుగుతుందో కూడా తెలిపే సంఘటన ఇది. వర్ణనాతీత ఉద్వేగ పరిస్థితి ఒక వృద్ధ ఉపాధ్యాయునికి, ఒక పూర్వ విద్యార్థికి ఎదురయ్యింది. ఆ సందర్భంలో విద్యార్థి ఆ ఉపాధ్యాయునికి ఇచ్చిన సర్‌ఫ్రైజ్‌ ఆ టీచర్‌నే కాక ఇతర ప్రయాణికు లను కూడా అబ్బురపరిచింది.. ఉద్వేగంతో కంటతడి పెట్టించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ వృద్ధుడు ప్రయాణిస్తున్నారు. చిన్నప్పుడు ఆయన వద్ద చదువు కున్న విద్యార్థే ఆ ఎయిర్‌లైన్స్‌కు పైలట్‌. తాను నడుపుతున్న విమానంలోనే తన చిన్నప్పటి టీచర్ ప్రయాణిస్తుండటంతో ఆ పైలెట్‌ తెగ సంతోషపడ్డాడు. తన టీచర్‌కి జీవితాంతం గుర్తుం డే సర్‌ఫ్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. ‘విమానంలో ఎడమ వైపు, నల్లకోటు ధరించిన ఆ వ్యక్తి నా స్కూల్‌ టీచర్‌. ఒకప్పుడు నాకు చదువు చెప్పిన నా టీచర్‌ ఈరోజు నేను నడిపే విమానంలో ప్రయాణిస్తుండడం నాకు చిరస్మరణీయం. ఆయనకు కూడా ఇది గుర్తుండిపోయేలా ఏదన్నా ఒక చిన్న సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పువ్వులు ఇచ్చి విష్‌ చేయాల్సిందిగా నా సహచర సిబ్బందిని కోరుతున్నాను’ అంటూ ఉద్వేగభరిత ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న ఆ టీచర్‌కి కన్నీళ్లాగలేదు. ఈ లోపు పైలట్‌ చెప్పినట్లుగానే విమానంలోని ఇతర సిబ్బంది ఫ్లవర్‌ బోకేలు ఇచ్చి టీచర్‌ని విష్‌ చేశారు. ఆ తర్వాత క్యాబిన్‌ నుంచి పైలట్‌ కూడా వచ్చి ఆయనను కలుసుకున్నాడు. టీచర్‌ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. పైలట్‌ చేసిన ఈ పనికి తోటి ప్రయాణికులు కూడా ఉద్వేగభరితులై, కన్నీరు పెట్టుకున్నారు. చప్పట్లు కొడుతూ పైలట్‌ను అభినందించారు.అదే విమానంలో టర్కీకి చెందిన ఇష్టిషమ్‌ ఉల్‌హక్‌ అనే విలేకరి కూడా ఉండడంతో ఈ విషయం మొత్తం వీడియో గా బాహ్య ప్రపంచాన్ని పలకరిం చింది. వీడియోను అతడు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘ తనకు చదువు చెప్పిన టీచర్‌ తను నడుపు తున్న విమానంలో ఉన్నారని తెలిసి ఈ పైలట్‌ ఈ రకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ దృశ్యం నన్నెంతో కదిలించింది. మన జీవితాలకు వెలుగునిచ్చిన ఉపాధ్యాయులకు మనం ఇచ్చే మర్యాద ఇది..’అని పేర్కొన్నాడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం