పోలవరానికి కేంద్రం సహకరిస్తోంది - బాబు


పట్టిసీమను సంవత్సరం లోపు పూర్తి చేసి రికార్డు సృష్టించామని, ఇక జనం జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాల వేడుకకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరాన్ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తన ఆశయమని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ హాజరయ్యారు. అసలు మొదట్లోనే కర్నూలుకు కాకుండా రాజధాని విజయవాడకి వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో బ్రహ్మాండంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు