కుక్క కాటుకి "చెప్పు" దెబ్బ


భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తో అతడి తల్లి,భార్య భేటీ విషయంలో పాకిస్థాన్ అమానుషంగా వ్యవహరించిన తీరుకు బిజెపి నాయకుడొకరు సరైన ప్రతిచర్యకు దిగారు. పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భాజపా ఢిల్లీ అధికార ప్రతినిధి తజేందర్‌ బగ్గా స్థానిక పాక్‌ హైకమిషన్‌కు చెప్పులు జతను ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చారు. మిగిలిన వారు కూడా ఇలానే చేయాలని అయన పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో చెప్పులను ఆర్డర్‌ చేసి ఆ స్క్రీన్‌ షాట్‌ను ట్వీట్‌ చేశారు. జాదవ్‌ కుటుంబానికి మద్దతుగా తన అనుచరులు కూడా ఇలా చెప్పులు ఆర్డర్‌ ఇవ్వాలని సూచించారు. ‘పాకిస్థాన్‌కు మన చెప్పులు కావాలి. మన చెప్పులు వారికి ఇద్దాం. అందుకే పాకిస్థాన్‌ హైకమిషన్‌కు చెప్పులు పంపుతున్నా’ అంటూ సదరు స్క్రీన్‌ షాట్‌ను జత చేశారు. తన అనుచరులు కూడా చెప్పులు ఆర్డర్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ను#jutabhejopakistan హ్యాష్‌ట్యాగ్‌కు జత చేసి పంపించాలని సూచించారు.కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలిసేందుకు తల్లి, భార్య వెళ్లగా.. వారి పట్ల పాక్‌ అధికారులు అమానవీయంగా వ్యవహరించారు. భారతీయ సంప్రదాయాలను గౌరవించకుండా వారి మెడలో పుస్తెలను తీయించారు. జాదవ్‌ భార్య చేతన్‌కుల్‌ పాదరక్షలను స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వలేదు కూడా. అందులో కెమెరా ఉందని ఓసారి, చిప్‌ ఉందని మరోసారి పాకిస్థాన్‌ మాటమార్చింది. అందుకే తజెందర్ ఈ తరహా ఆందోళన చేపట్టారు.

ముఖ్యాంశాలు