ఎఫ్ఆర్డీఐ బిల్లు పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం


సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తున్నదని అనిపిస్తోందని విశాఖ రూరల్ బీజేపీ అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లు పై జారుతున్న దుష్ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ వ్యాఖ్య చేసారు. ఈ సంవత్సరం ఆగష్టులో ప్రవేశ పెట్టిన ఎఫ్ఆర్డీఐ బిల్లు ఇంకా తుది రూపం దాల్చలేదని, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఉన్నది=ని తెలిపారు. మార్పులు చేర్పులు ఇంకా జరుగుతాయి. రాబోయే బడ్జెట్ సెషన్లో ఇది పాస్ కాకపోవచ్చు కూడా అని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు పైన ప్రచారంలో ఉన్న పలు అపోహలకు ఆమె సమాధానాలిచ్చారు. బ్యాంకులలో డిపాజిట్లు చేసుకున్నవారిలో ఆందోళన రేకెత్తేలా అసత్య ప్రచారం పెద్దఎత్తున జరుగుతున్నందున వాస్తవాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. బిల్లుపై సందేహాలకు సమాధానంగా ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఈ బిల్ ఆమోదం అయితే రిజల్యూషన్ కార్పోరేషన్ ( Resolution Corporation) అనే సంస్థ ఏర్పడుతుంది. ఈ సంస్థ...ఆర్థిక సంస్థలను ....ముఖ్యంగా బ్యాంకులను పర్యవేక్షిస్తూ. నష్టాల వైపు ( నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ వలన) నడుస్తున్న వాటిపై దిద్దు బాటు చర్యలు తీసుకుని సరియైన మార్గంలో పెడుతుంది. 2. చాలా వరకు ప్రభుత్వము నష్టాలలో ఉన్న బ్యాంకులకు , బడ్జెట్ ద్వారా కొంత మూలధన సహాయం ( Recapitalisation ) చేసి ఆదుకుంటూ ఉంటుంది. 3. ఈ బిల్లులో బెయిల్ - ఇన్ (Bail-in) అనే అంశం జోడించబడింది. దీని ద్వారా డిపాజిటర్ల సొమ్మును ఈక్విటీ గా భావించి నష్టాలను అధిగమించడానికి ఆ బ్యాంకు వాడుకోవచ్చు . 4. ఈ అంశాన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలి: a) లక్ష వరకు డిపాజిట్లకు DICGC ఇన్సూరెన్స ఇస్తుంది. ఇప్పుడు రాబోయే రిజల్యూషన్ కార్పోరేషన్ ఈ లిమిట్ ను పెంచనుంది. b) డిపాజిటర్ల అనుమతి లేకుండా వారి డిపాజిట్లను బ్యాంకు ఉపయోగించలేదు. 5. ఇంత వరకు భారత దేశంలో నష్టాలు వచ్చిన బ్యాంకులు ఎప్పుడూ లిక్విడేట్ కాలేదు. 6. ఇటువంటి పరిస్తితి లో డిపాజిటర్లకు ఇబ్బంది కలుగకుండా పైన చెప్పినట్టు ప్రభుత్వము ఆదుకుంటుంది. 7. డిపాజిటర్లకు పూర్తి రక్షణ కలిపించే విధంగానే బిల్లు రూపొందించడం జరుగుతుందని, తగినన్ని మార్పులు, చేర్పులు చేసిన పిమ్మటే అమలు లోకి వస్తుందని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు వివరణ ఇవ్వడం జరిగింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం