పారిశ్రామికవేత్తను ఆకట్టుకున్న చిరు వ్యాపారం!


మహీంద్రా బొలెరో ట్రక్‌పై మొబైల్‌ ఫుడ్‌ బిజినెస్‌ ను విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళకు సాయం చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సిద్ధమయ్యారు. మంగళూరుకు చెందిన 34 ఏళ్ల శిల్ప మొబైల్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఆర్టికల్‌ ఇటీవల ఓ మీడియాలో రాగా చూసిన ఆనంద్‌ మహీంద్రా ఆమె అంగీకరిస్తే ఆ వ్యాపారంలో తాను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2008లో భర్త కనిపించకుండా పోవడంతో శిల్ప ధైర్యంగా మొబైల్‌ ట్రక్‌ ఫుడ్‌ వ్యాపారాన్ని చేపట్టింది. ఇప్పుడు ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. తన సోదరుడికి సహాయం చేసేందుకు శిల్ప రెండో అవుట్‌లెట్‌ను ప్లాన్ చేస్తున్నది. ‘ఆమె చేస్తున్న వ్యాపారంలో మహీంద్రా బొలెరో చిన్న పాత్ర పోషిస్తోంది. అందుకే నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. విజయవంతంగా వ్యాపారం చేస్తున్న ఆ మహిళకు రెండో అవుట్‌లెట్‌ ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయండి’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు