ఉగ్రవాదితో వేదికపై పాలస్తీనా రాయబారి

ముంబయి దాడుల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌,సయీద్‌ పాలస్తీనా రాయబారి వలీద్‌ అబు అలీ వేదిక పంచుకోవడం ఇప్పుడు బయటపడింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని భారత్‌ స్పష్టం చేసింది. జమత్‌-ఉద్‌-దవా టెర్రరిస్ట్ సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లోని రావల్పిండి ఏరియాలో ఓ ర్యాలీ నిర్వహించాడు. ఈ ర్యాలీకి పాక్ లో పాలస్తీనా రాయబారి వలీద్‌ అబు అలీ కూడా హాజరయ్యాడు.  సయీద్‌తో కలిసి వేదికపై మాట్లాడడమే గాక సన్నిహితంగా ముచ్చటించిన ఫోటోలు కూడా స్థానిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ కోసం పాలస్తీనాను డిమాండ్‌ చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించి దిల్లీలోని పాలస్తీనా రాయబారితో, పాలస్తీనా అధికారులతో చర్చిస్తున్నాం’ అని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు.ఇటీవల జెరూస‌లెంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించినప్పటికీ భారత్‌ పాలస్తీనాకే మద్దతిస్తూ ఐరాసలో ఓటు వేసింది. అలాంటిది భారత్‌ లో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సయీద్‌తో పాలస్తీనా రాయబారి ర్యాలీలో పాల్గొనడం ఏమిటని భారత్ ప్రశ్నించింది. 

Facebook
Twitter