యువతిని చంపి... ఆత్మహత్య చేసుకున్నాడు


కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఒకడు యువతిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం నెమలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తున్న పల్లవిని గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం ఉదయం పల్లవి పాఠశాలకు వెళ్తున్నపుడు కూడా వెంటపడి వేధించాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నపుడు శ్రీనివాసరాజు మరోసారి పాఠశాల వద్దకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని పల్లవిని బలవంతపెట్టాడు. ఆమె తిరస్కరించడంతో ఆగ్రహించిన శ్రీనివాసరాజు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల పల్లవికి పెళ్లి కుదరడంతో అతడీ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం