మాల్యా మూడో పెళ్ళికి తరలుతున్న తారలు


భారత్ లో వేలాది కోట్ల బ్యాంకు అప్పులు ఎగవేసి లండన్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు. మాల్యా గతంలో తాను నడిపిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన పింకీ లాల్వానీ అనే మహిళని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇది అతడికి అధికారికంగా జరుగుతున్న మూడో పెళ్లి. ఈ పెళ్లికి బాలీవుడ్‌ తారలు హాజరుకానున్నట్లు సమాచారం. కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌ కు మోడల్స్‌గా వ్యవహరించిన దీపిక పదుకొణె, కత్రినా కైఫ్‌, నర్గిస్‌ ఫక్రి తదితరులు ఈ పెళ్ళికి వెళుతున్నారని తెలిసింది. మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌తో దీపిక కొంతకాలం డేటింగ్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. భారత్ లో బ్యాంకులకు రూ.9,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టి మాల్యా లండన్‌కు పారిపోయాడు. మాల్యాను లండన్‌ నుంచి భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. లండన్‌ కోర్టులో దీనిపై కేసు నడుస్తోంది. మాల్యా ఆస్తుల్ని జప్తు చేసిన అక్కడి కోర్టు వారానికి రూ.16 లక్షలు అతడి జీవన భత్యం కింద అందిస్తోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం