అవిశ్వాస తీర్మానంపై బీజేపీలో భయం - ఏచూరి


సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలలో పొలిట్‌బ్యూరో రూపొందించిన పార్టీ సంస్థాగత ముసాయిదా నివేదికను ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే అఖిల భారత మహాసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు వారాలుగా తెదేపా, వైకాపాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున ఎన్డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానాలను చర్చకు తీసుకురావడంలో కేంద్రం విఫలమై తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే అవిశ్వాసంపై కేంద్రం భయపడుతోంది. మిగతా పార్టీలతో పాటు మేము కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నాం. చర్చ జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా, హామీ సహా భాజపా అన్ని వైఫల్యాలపై చర్చిస్తాం. ఫెడరల్‌ ఫ్రంట్‌పై సమావేశాల్లో చర్చించలేదు. దానిని ఎన్నికల సమయంలో చర్చిస్తాం’’ అని వెల్లడించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం