రాములవారి కల్యాణ వేడుకలో విషాదం


కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. పెను గాలులకి రేకుల షెడ్లు చెల్లాచెదురయ్యాయి. రేకులు ఎగిరి భక్తులపై పడటంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వర్షబీభత్సానికి భక్తులు ఆందోళనకు గురయ్యారు. విద్యుదాఘా తంతో ఒకరు, గుండెపోటుతో మరొకరు, తీవ్ర గాయాలై ఇద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య, బద్వేల్‌ వాసి చిన్నయ్య, మచిలీపట్నానికి చెదిన మహిళ ఉన్నారు. క్షతగాత్రులను కడప ప్రభుత్వ ఆసుపత్రి, రిమ్స్‌కు తరలిం చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. వర్షానికి ఒంటిమిట్టలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం అంధకారంలోనే స్వామివారి కల్యాణ క్రతువు నిర్వహించారు.

ముఖ్యాంశాలు