పార్టీ పెడతా... పోటీ చేస్తా - రజనీకాంత్


రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆదివారం స్పష్టంగా ప్రకటించారు. చెన్నైలో ఆరో రోజు అభిమానులతో జరిగిన సమావేశ సందర్భంగా రజనీ తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపన జరుగుతుందని... ఈ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశ తనకు లేదని, వాటిపై ఆశతో రాజకీయాల్లోకి రావడం లేదని వెల్లడించారు. 31 వ తేదీ న ఈ విషయంలో స్పష్టత ఇస్తానని రజనీ ముందునుంచే చెబుతున్న విషయం తెలిసిందే. తన వెనుక ఉన్న స్క్రీన్ పై బాబా చిత్రంలో ప్రాచుర్యంలోకి వచ్చిన మృగి ముద్ర కనిపిస్తుండగా రజనీ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేసి అభిమానులకు రెండు చేతులూ ఎత్తి అభివాదం చేసినపుడు ఆడిటోరియం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది.

ముఖ్యాంశాలు