వీపు మీదే కొట్టాను.. పొట్ట మీద కొట్టలేదు


పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావుకు పోలీసు శాఖ ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ ఏర్పాటు చేసిన పరేడ్‌కు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, నూతన డీజీపీ మాలకొండయ్య హాజరయ్యారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని డీజీపీ స్వీకరించారు. సాంబశివరావు మాట్లాడుతూ ‘33ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. విధి నిర్వహణలో ఎవరినీ కడుపుపై కొట్టలేదన్నారు. తనకు చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలు సమర్పిస్తున్నానని తెలిపారు. తన గురువు రామకృష్ణ ప్రోద్బలంతో తన సామర్థ్యాన్ని తాను గుర్తించానన్నారు. బెల్లంకొండలో ఏఎస్పీగా తన ప్రస్థానం మొదలైందని అన్నారు. ఏపీ పోలీసులు దేశంలోనే ప్రాముఖ్యత సంపాదించారని అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న సాంబశివరావు ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని నూతన డీజీపీ ఎం.మాలకొండయ్య కొనియాడారు. తాను సర్వీసులో ప్రసాదరావు నుంచి ఛార్జి తీసుకోవడం ఇది ఆరోసారి అన్నారు. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు.

ముఖ్యాంశాలు