మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు

హైదరాబాద్ మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. నాగోల్-అమీర్‌పేట్ మార్గంలో ఆదివారం ఉదయం సుమారు రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం సర్వీసుల నిలిపివేతకు సంబంధించి సమాచారం కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు బయలుదేరిన ఒక సర్వీసులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ రైలును ప్రకాశ్‌నగర్ పాకెట్ పార్కింగ్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు టెర్మినళ్ల వద్దా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే టికెట్లు కొనుక్కుని ఫ్లాట్‌ఫామ్స్‌పైకి వచ్చిన ప్రయాణికులు రైళ్లు కదలకపోవడంతో ఇబ్బంది పడ్డారు. అయోమయస్థితిలో వేరే మార్గాలను వెదుక్కొని వెళ్లిపోయారు.