నైరోబీలో ఘోర ప్రమాదం - 36 మంది మృతి


కెన్యా రాజధాని నైరోబీలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. కెన్యా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశ్చిమ కెన్యాలోని బుసియా నుంచి వస్తున్న బస్సు నకురు–ఎల్‌డొరెట్‌ రహదారిపైకి రాగానే లారీ ఢీకొంది. 30 మంది అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరూ మరణించారు. మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటప డింది. ఈ నెలలో ఇదే రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదాలలో సుమారు 100 మంది మరణించారు. ఏటా కెన్యాలో రోడ్డు ప్రమాదాల వల్ల మూడువేల మంది మృత్యువాత పడుతున్నారని అంచనా.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం