జనసేనలో చేరిన పవన్ కళ్యాణ్


జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభించి తొలి సభ్యత్వం నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పరిపాలన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పార్టీ ముఖ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. పదేళ్లకు పైగా తనను అనుసరిస్తున్న వారితో పవన్‌కల్యాణ్‌ ఇష్టాగోష్టి సమావేశాలు జరుగుతున్నాయి. జనసేన నిర్వహించనున్న శిక్షణ శిబిరాల గురించి వారితో చర్చించారు.

ముఖ్యాంశాలు