నిబంధనల మేరకే వ్యాపారం.. విలువలే ప్రాతిపదిక : రియల్టర్ బండి సురేష్

తనను లక్ష్యంగా చేసుకొని ఈమధ్య జరిగిన దుష్ప్రచారాన్ని ప్రముఖ రియల్టర్ బండి సురేష్ ఖండించారు. ఇటీవల పేపర్లలో ఓ వార్త వచ్చింది. రాజానగరం ప్రాంతంలో తాను ఎం డి గా ఉన్న ఎస్ బి వెంచర్ పేరిట సురేష్ వేసిన రియల్ ఎస్టేట్ లే అవుట్ లో కొందరు కమ్యూనిటీ స్థలాల్ని కూడా విక్రయించి డబ్బు చేసుకున్నారని.. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొట్టారని ఆ వార్తా కథనాల సారాంశం. ఇందుకు సంబంధించి దోషులుగా కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఈ ప్రకటన కూడా విజిలెన్స్ వారు ఇచ్చినట్టే ఉంది. దీనిపై బండి సురేష్ స్పందిస్తూ.. అసలు తనకు ఎస్ బి వెంచర్ అనే సంస్థే లేదని.. అలాంటి పేరున్న ఏ సంస్థలోనూ తనకు హోదా గానీ, బాధ్యత, భాగస్వామ్యం గానీ లేవని చెప్పారు. తాను రాజమండ్రి, రాజానగరం, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్ని గత పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని అయన గుర్తు చేసారు. ఆయా ప్రాజెక్టులలో ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు జరగలేదన్నారు. తమ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన ప్రతి చర్యనూ తీసుకున్నామన్నారు. పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. విలువలే ప్రాతిపదికగా వ్యాపారం చేస్తున్న తనపై ఎవరో దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దీనిని ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఈ సమయంలో తనకు మద్దతు తెలిపి అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసత్య కథనాలతో తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసారు.
ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం