బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ పరీక్ష సక్సెస్


బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఈ మిసైల్‌కు ఉంది. ఒడిశాలోని ఓ కేంద్రం నుంచి భూమిపై నుంచి దీనిని ప్రయోగించారు. దీనిని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. డీఆర్‌డీవో పీజే-10 ప్రాజెక్టు క్రింద ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. దేశీయ బూస్టర్‌తో దీనిని నిర్వహించారు. బ్రహ్మోస్ అనేది రామ్‌జెట్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనిని జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి, భూమిపై నుంచి ప్రయోగించవచ్చు. రష్యాలోని ఓ సంస్థతో కలిసి డీఆర్‌డీవో దీనిని అభివృద్ధిపరిచింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us