అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు


అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించింది. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 15 తర్వాత విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఆన్ లైన్ క్లాసులు జరుపుకోవచ్చు. కానీ విద్యాసంస్థలు తెరవాలంటే మాత్రం తల్లిదండ్రులరాతపూర్వక అనుమతి తప్పనిసరని పేర్కొంది.

ముఖ్యాంశాలు