జనవరికల్లా వ్యాక్సిన్ రావచ్చు


వచ్చే జనవరినాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అయితే వ్యాక్సిన్ పంపిణీలో సవాళ్లు ఉన్నాయన్నారు. ‘ఇండియా టుడే’ హెల్త్‌గిరి అవార్డ్స్, 2020 సందర్భంగా డాక్టర్ గులేరియా శుక్రవారం మాట్లాడారు. మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టమని చెప్పారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్‌ నిరోధంలో వ్యాక్సిన్ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ప్రారంభంలో దేశ జనాభా మొత్తానికి అవసరమైనంత మోతాదులో వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని కూడా తెలిపారు. వ్యాక్సిన్ సిద్ధమైన తర్వాత దానిని ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం మరొక సవాలు అని చెప్పారు. వ్యాక్సిన్ ఎవరికి ముందుగా ఇవ్వాలనే విషయంపై చర్చలు ప్రారంభమైనట్లు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం