కాంగ్రెస్ ఆర్జేడీ పొత్తుకు ప్రతిష్టంభన


బీహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన తరుణంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ ఎన్డీయే- మహాగట్ బంధన్ అనే రెండు కూటముల మధ్యా సంకుల సమరం సాగనుంది. అయితే ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్ బంధన్ లోని ప్రధాన పక్షాలు ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య పొత్తుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీలో ప్రతిష్టంభన నెలకొంది. అటు ఎన్డీయే సీట్ల పంపిణీని ఖరారు చేసుకుకి కదనోత్సాహంతో ఉండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్ మాత్రం మాటల యుద్ధంలో మునిగిపోయి ఉన్నాయి. కాంగ్రెస్ ఇన్‌చార్జీ శక్తిసింగ్ ఢిల్లీ పెద్దలతో కూలంకషంగా చర్చించిన మీదట పలువురు సీనియర్లతో కలిసి పాట్నాకు చేరుకున్నారు. ఈ కీలక భేటీకి ఆర్జేడీ గైర్హాజరైంది. దీంతో ఆర్జేడీపై కాంగ్రెస్ మండిపడుతోంది. తేజస్వీ యాదవ్ అపరిపక్వ నేత అని కాంగ్రెస్ విమర్శించింది. 2009-2010 లో ఆర్జేడీ- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరనప్పుడు సంభవించిన నష్టంపై లాలూకు పూర్తి అవగాహన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2015 లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీతో మహాగట్ బంధనాన్ని ఏర్పరిచారు అని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. తేజస్వీ యాదవ్ కూడా అలా పరిపక్వతతో వ్యవహరించాలని చెప్పారు. ఈ మాటలపై తేజస్వీ ముఖ్య అనుచరులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కీలక సమయంలో అనవసరపు వ్యాఖ్యలతో వింత వాదానికి దిగుతున్నారన్నారు. తేజస్వీ యాదవ్ అనుభవాన్ని కాంగ్రెస్ తక్కువగా అంచనా వేస్తోందని ఎద్దేవా చేసారు. బిహార్ లోని 12 కోట్ల మంది తేజస్వీ బోటులో ఎక్కడానికి సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ ఆ పుట్టిని ముంచడానికి ప్రయత్నిస్తోందన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం