రాజధాని ప్రజా ప్రతినిధులు ఉన్నారా ?


ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని లేకుండా రాజకీయ క్రీడకు నిత్యం అగ్గి రాజేస్తున్న నేటి నేతలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం నేటి తరం పై వుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 6 ఏళ్ళు పూర్తి కావొచ్చిందని, చంద్రబాబు, జగన్ ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించు కోవటం తప్ప రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి సారించటంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని, ఈ ఆరేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచటంలోను, పారిశ్రామిక అభివృద్ధి సాధించటంలోనూ చేతకాని తనాన్ని నిరూపించుకున్నారని ఆయన తూర్పారబట్టారు. చంద్రబాబు ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణ యుగం సాధిస్తామని, జగన్ ప్రత్యేక హోదానే మా పార్టి ఊపిరి అని ప్రజలనునమ్మిం చారని,అధికారం చేపట్టిన అనంతరం ప్రజల్ని మోసం చేసారని విమర్శించారు.

ఒక మారు భారత ప్రధాని నరేంద్ర మోది సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని ప్రకటించిన అనంతరం జగన్ సర్కార్ ఏపికి 3 రాజధానులు అని రాజకీయ సంక్షోభానికి కుట్ర చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోది ప్రేక్షక పాత్రకు పరిమితం అవ్వటం లో కుట్ర దాగి వుందా అనే ప్రజా సందేహనికి బదులు ఇవ్వాలని హెచ్చరించారు. మూడు రాజధానులు అంటే భవిష్యత్ లో 3 చిన్న రాష్ట్రాలకు విభజన నిప్పు పెట్టె కుట్రకు ఆజ్యం పోస్తున్నట్టుగా వుందని , మనస్తాపం చెందారు. 3 రాజధానుల బిల్లు ను జగన్ సర్కార్ రద్దు చేయాలని, ప్రత్యేక హోదా కు ఉద్యమ కార్యాచరణ ను రూపొందించాలని, అమరావతి రైతుల, ఉద్యమం లోకి రాజధాని ప్రాంతంలోగల ఎమ్మెల్యే లు, ఎంపీలు ప్రత్యక్ష పోరాట భాగస్వాములు కావాలని లేకుంటే రాజధాని ప్రాంతంలోగల అధికార పార్టి నేతలకు భంగ పాటు తప్పదని మేడా శ్రీనివాస్ హెచ్చరించారు. సభకు అర్పిసి సీనియర్ నాయకులు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ముఖ్యాంశాలు