వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి వెల్లంపల్లి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. ఈనెల 25న విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మంత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యాంశాలు