రాగాల పల్లకీలో

రాగాల పల్లకీలో సప్త స్వరాలు దాటి.. సంగీత సాగరం లో స్వరమవ్వాలని పదమవ్వాలనీ కోరిక.. ||రాగాల ||

సుమధురం , మృదులం నవనీతం పంచమ శ్రుతి లో కోకిల గానం ఆ గానానికి గళమవ్వాలని ప్రకృతి లో వసంతమవ్వాలని మది కోరిక ||రాగాల||

పయనించే జీవితం లో ఎన్నో ఆరోహణలు అవరోహణలు రాగం తానం శ్రుతి లయ మిళితం జీవన రాగం కావాలని మది కోరిక ||రాగాల ||

​- Swathi Akella ,Bangalore

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం