తప్పుడు ప్రచారంపై రఘురామ మండిపాటు


జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, అందుకు సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. దీనిపై న్యాయవాదితో సంప్రదించినట్లు చెప్పారు. పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. ఏడుకొండలు.. ఏడు రెడ్లు అన్నట్లు తిరుమల తయారైందని రఘురామ కృష్ణంరాజు వాపోయారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం