రాహుల్, ప్రియాంక అరెస్టు

హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించ డానికి ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీని, ప్రియాంక వాద్రాను గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్లు దిగి రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వారి ని కార్యకర్తలు, ఇతర నాయకులూ అనుసరిం చారు. అయితే పోలీసులు అభ్యంతరం చెప్పి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.పోలీసుల తీరుపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులా టలో రాహుల్ కిందపడ్డారు. రోడ్డుపై కేవలం నరేంద్ర మోదీయే నడవాలా? సామాన్యులకు నడి చే హక్కులేదా?’’ అని రాహుల్ మండిపడ్డారు. పోలీసులు తనను తోసేసారని, లాఠితో కొట్టారని ఆయన ఆరోపించారు. తనను పోలీసులు తోసేస్తేనే కింద పడ్డానన్నారు. యూపీలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని ప్రియాంక వాద్రా విమర్శించారు.