రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత


కేంద్ర మంత్రి, లోక్ జన్‌ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ ద్వారా ఈ సంగతి వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్‌ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు. గంగ నది దాటి ఉత్తరం వైపు వెళ్తే ,నేపాల్ లో పుట్టి బీహార్ లో గంగ లో సంగమం అయ్యే గండకి నది సంగంలో ఉండే ఊరు హజీపూర్..

1977 నుంచి 2019 వరకు 42 సంవత్సరాలు కాలంలో కొద్దికాలం మినహా హజీపూర్ నుంచి లోక్ సభ సభ్యుడు గా రాం విలాస్ పాశ్వాన్ ఎన్నికయ్యారు. హజీపూర్ లో ప్రజలు ని రాం విలాస్ మీకు ఏమి చేశాడు అంటే మా ఊరు కి రైల్వే జోన్ తెచ్చారు ఇంతకు మించి మాకు ఏమి అక్కర్లేదు అంటారు. 75 సంవత్సరాలు వయస్సు.. 50 సంవత్సరాలు రాజకీయ జీవితం.. 25 సంవత్సరాల వయసుకే ఎమ్యెల్యేగా బీహార్ అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు.

1977 లో మొదటి సారి లోక్ సభ కి హజీపూర్ నుంచి ఎన్నికయిన పాశ్వాన్ 1977,1980, 1989, 1996,1998,1999, 2009,2014 లో హజీపూర్ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. 2019 నుంచి రాజ్య సభ సభ్యుడు.

గత 30 సంవత్సరాలుగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉంటూ వచ్చారు. 1977, మురార్జీ .1989 విపి సింగ్, 1990 చంద్ర శేఖర్, 1996 దేవెగౌడ, 1997 గుజ్రాల్, 1998 వాజపేయి 1999 వాజపేయి 2004 మన్మోహన్ సింగ్, 2014 నరేంద్ర మోదీ, 2019 నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో అయన ఉన్నారు. ఇందిరా, రాజీవ్ ,పివి క్యాబినెట్ లు తప్ప మిగిలిన అన్ని మంత్రివర్గాల్లో పనిచేసినవాడు పాశ్వాన్ .

లోక్ దళ్, జనత పార్టీ , జనతా దళ్ , సమతా పార్టీ , లోక్ జన శక్తి .. ఇవీ ఆయన మారిన పార్టీలు.

1989 లో జరిగిన లోక్ సభ సాధారణ ఎన్నికలలో 515000 మెజారిటీ తో హజీపూర్ నుంచి ఆయన విజయం సాధించారు. ఈ రికార్డును 2014 లో మోదీ వారణాసి నుంచి 550000 మెజారిటీ సాధించి బద్దలుకొట్టారు. రైల్వే మంత్రిగా పాశ్వాన్దేశంలో 9 రైల్వే జోన్ లు ఉండగా, 16 రైల్వే జోన్ లకి పెంచారు. తనను గెలిపించిన హజీపూర్ కి రైల్వే జోన్ (EAST CENTRAL RAILWAY) ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు రైల్వే డివిజన్ కి రాం విలాస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం