ఎంసెట్ ఇంజినీరింగ్ లో షిర్డీసాయి విద్యార్ధి జయకేతనంతాజాగా విడుదలైన ఎపి ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో షిర్డీ సాయి జూనియర్ కాలేజీ విద్యార్ధి కెవిడి శ్రీహర్ష రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. లక్ష్య ఐఐటి అకాడమీ లో ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఇతడి అద్భుత విజయానికి దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో ఇదే మొదటి రాంక్ కావడం విశేషం. ఇటీవల జె ఈ ఈ మెయిన్, జె ఈ ఈ అడ్వాన్సుడ్ పరీక్షల్లోనూ, సీప్ లోను కూడా షిర్డీ సాయి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి ప్రభంజనం సృష్టించారు. గోదావరి జిల్లాల విద్యారంగ ప్రతిష్టను అద్వితీయమైన ఫలితాలతో ఇనుమడింపజేస్తున్న షిర్డీసాయి విద్యార్థులను, బోధనాసిబ్బందిని సంస్థ డైరెక్టర్ తంబాబత్తుల శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీవిద్య అభినందించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం