అయోధ్య రాముడి కోసం ఓంకారం నినదించే గంట


అయోధ్యలో త్వరలో నిర్మితం కానున్న భవ్య రామమందిరానికి ఓ భారీ కంచు గంట వచ్చి చేరింది. రామేశ్వరానికి చెందిన భక్తురాలు లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి రామేశ్వరం నుంచి 4500 కీమీ ప్రయాణించి ట్రస్టు సభ్యులకు దీనిని అందజేశారు. 613 కిలోల బరువుతో రాజ్యలక్ష్మి తయారు చేయించిన ఈ భారీ గంటలో ఓ ప్రత్యేకత ఉంది.

సాధరణంగా ఏ ఆలయంలో కానీ ఇళ్లల్లో కానీ ఏ గంటనైనా కొడితే టంగ్ టంగ్ అని మోగుతుంది. కానీ ఈ భారీ గంటను కొడితే మాత్రం చుట్టుపక్కల కిలోమీటర్ వరకు ‘ఓం’ అనే శబ్దం వినిపిస్తుంది. 4.13 అడుగుల పొడవు 3.9 అడుగుల వెడల్పుతో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు వినాయకుడి ప్రతిమలను కూడా ఏర్పాటు చేశారు. జై శ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంచారు. రామాయణంలో రామేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది. సీతాదేవి కోసం ఇక్కడి నుంచే రాముడు లంకపై దండెత్తాడు. వానరసేనతో కలిసి లంక చేరడానికి శ్రీరాముడు సముద్రంలో వారధిని నిర్మించాడు. ఆ స్థల ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి నుంచి భారీ గంటను తయారు చేసి పంపించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం