వన్యప్రాణి సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక విధి


రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు

మనకు ఆశ్రయం ఇస్తున్న ప్రకృతిని, అందులో మనతోపాటు జీవిస్తున్న ఇతర ప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది అని రాజమండ్రి సర్కిల్ అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు అన్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (జి) చెబుతోంద న్నారు. సప్తాహాన్ని రాజమండ్రి సర్కిల్ కార్యాలయంలో అటవీ సంరక్షణాధికారి ఎన్ నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. వన్యప్రాణి విభాగం రూపొందించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అహింసకు ప్రతి రూపమైన మహాత్మా గాంధీ జయంతి నాడే వన్యప్రాణి సప్తాహం మొదలవడంలోని అంతరార్థం అందరూ తెలుసుకోవాల న్నారు. వన్యప్రాణుల్ని కాపాడడమే ధ్యేయంగా 1952 నుంచీ ఏటా భారతదేశంలో వన్యప్రాణి సప్తాహం జరుగుతున్నదని ఆయన తెలిపారు. వన్యప్రాణులు అంతరిస్తే మానవుడి మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అటవీ శాఖా వన్యప్రాణి సప్తాహం సందర్భంగా వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది చెప్పారు. వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ విభాగం డీ ఎఫ్ ఓ సి.సెల్వం, అటవీ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎంవి ప్రసాదరావు, ఎఫ్ ఆర్ ఓ సునీల్ కుమార్, ఎఫ్ ఎస్ ఓ అశ్విన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం